తార్నాక స్ట్రీట్ నెం.3 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక

by Kodari Anjali |

తార్నాక స్ట్రీట్ నెం.3 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ సామాజిక సేవకుడు, బీజేపీ నాయకుడు డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తార్నాక స్ట్రీట్ నెం.3 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ, సికింద్రాబాద్: తార్నాక స్ట్రీట్ నెం.3 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ సామాజిక సేవకుడు, బీజేపీ నాయకుడు డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా అడ్వకేట్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మధు, కోశాధికారిగా మహ్మద్ అస్లాం పాషా, కార్యవర్గ సభ్యులుగా వెంకట సుబ్బారావు, జాయ్, మెర్సీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన పార్కును తన సొంత నిధులతో అభివృద్ధి చేసి ఆయుర్వేద పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

లిఖితపూర్వకంగా తెలియజేస్తే...

కాలనీ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కాలనీ సమస్యల డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, భద్రత తదితర సమస్యలను నివాసితులు లిఖితపూర్వకంగా తెలియజేస్తే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి నెలా కాలనీ న్యూస్ లెటర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని సుమారు 280 ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ నాయకత్వంలో తార్నాక స్ట్రీట్ నెం.3 ఆదర్శ కాలనీగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని కాలనీ వాసులు వ్యక్తం చేశారు.

Next Story