- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే వాహనమైనా వదలం
అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా బుధవారం యాకుత్ పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ భాషా ఖాద్రి వాహనాన్ని సంతోష్ నగర్ పోలీసులు తనిఖీ చేశారు.

X
దిశ, చంపాపేట్ : అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా బుధవారం యాకుత్ పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ భాషా ఖాద్రి వాహనాన్ని సంతోష్ నగర్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర మాట్లాడుతూ... ఎన్నికలను పురస్కరించుకొని ప్రతిరోజూ వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బుధవారం సంతోష్ నగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి వాహనాన్ని కూడా తనిఖీలు నిర్వహించారు. తన వాహనాన్ని తనిఖీ చేయడానికి ఎమ్మెల్యే భాషా ఖాద్రీ పూర్తిగా సహకరించినట్టు తెలిపారు. వ్యాపారులు తమ డబ్బులను తరలించే సమయంలో అందుకు సంబంధించిన పూర్తి పత్రాలను తమ వెంట ఉంచుకోవాలన్నారు.
Next Story






