- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రిలో డైట్ విత్ డొమెస్టిక్ టచ్.. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి
గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి.

దిశ , హైదరాబాద్ బ్యూరో: గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, ఇది దుర్వినియోగం కాకుండా నిరతంరం తనిఖీలు చేయాల్సిన పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టించుకోకపోవడంతో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించే వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు , ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ , రెస్టారెంట్లు ఇతర వ్యాపార సంస్థలలో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగంచడానికి వీలులేదు. అయితే అధికారుల అలసత్వం కారణంగా వీటిని ఎక్కడ పడితే అక్కడ వినియోగిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతినిత్యం వేలాది మంది రోగులు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం యదేచ్ఛగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన వైద్య ఆరోగ్యశాఖ, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వదిలేయడంతో డైట్ పనులు పొందిన కాంట్రాక్టర్ రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ఆహారం సరఫరా చేసేందుకు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారు . రోడ్డు పక్కన డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న టీ స్టాల్, ఇతర చిరువ్యాపారులపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న అధికారులకు ప్రభుత్వ ఆస్పత్రులలో డొమెస్టిక్ సిలిండర్లు ఎలా అనుమతిస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది .
లక్షలలో తేడా ...
కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగించాల్సిన చోట డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తుండడంతో లక్షలాధి రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది . ముఖ్యంగా చారిత్రాత్మక ఉస్మానియా , కోఠి మెటర్సిటీ , పేట్లబుర్జు తదితర ప్రభుత్వ హాస్పిటల్స్ లో సంవత్సరాలుగా రోగులకు, డాక్టర్లకు, సిబ్బందికి ఆహారం సరఫరా చేసేందుకు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు . ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో ప్రతినిత్యం సుమారు ఐదు సిలిండర్ల వరకు అవసరం పడుతుంది. డొమెస్టిక్ సిలిండర్ తో పోలిస్లే కమర్షియల్ సిలిండర్ ధర రెట్టింపు ఉండడంతో ప్రతినిత్యం సుమారు ఆరు వేల రూపాయల తేడా అవుతోంది. ఇదే సగటున నెలకు లెక్కిస్తే సుమారు రెండు లక్షలు, సంవత్సరానికి రూ 24 లక్షల వరకు తేడా అవుతోంది. ఇదే తీరులో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తే ప్రతి నెల కోట్లాది రూపాయల ప్రభుత్వ రాబడికి గండిపడుతోంది. కమర్షియల్ సిలిండర్లు వినియోగించాల్సిన చోట డొమెస్టిక్ వినియోగిస్తుండడం కాంట్రాక్టర్లకు వరంగా మారింది.
సేవ కాదు - వ్యాపారమే
ప్రభుత్వ ఆస్పత్రులలో డైట్ సరఫరా చేసేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. టెండర్లు వేసి పనులు దక్కించుకుంటారు. రోగులకు జనరల్ డైట్ రూ 80 , హై ప్రోటీన్ ( థెరపిటిక్ ) డైట్ రూ 112 , డాక్టర్లకు రూ 160 చొప్పున ప్రభుత్వం డైట్ పనులు పొందిన కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ప్రతినిత్యం వేల సంఖ్యలో ఆహారం సరఫరా చేయాల్సి ఉంటుంది. వీరు చేసేది సేవా కార్యక్రమం కాదు, ఉచిత ఆహారం సరఫరా అంతకన్నా కాదు. అయినా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. అయితే హోటళ్లలో ఈ సిలిండర్లను వినియోగిస్తే అధికారులు కేసులు చేస్తున్నారు . అలాంటప్పుడు అధికారికంగా పనులు పొంది హాస్పిటల్స్ లో డైట్ సప్లై వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు . అధికారులు ఇప్పటికైనా దాడులు చేసి ప్రభుత్వ ఆస్పత్రులలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న డైట్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .
డొమెస్టిక్ వాడొద్దు : డాక్టర్ నరేందర్ కుమార్- తెలంగాణ డీఎంఈ ...
ప్రభుత్వ ఆస్పత్రులలో డైట్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించరాదు. రోగులకు, డాక్టర్లు ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. డైట్ కాంట్రాక్టర్ చేసేది కూడా ఒక రకంగా వ్యాపారమే. డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలి.
domestic-gas-misuse-in-govt-hospitals-hyderabad






