ఈదలకుంట నాలా దారి మళ్లింపు.. నాలా కనుమరుగు

by Ajay Maddhiboyina |

ఒకప్పుడు హైటెక్ సిటీ ఐటీ కారిడార్ చెరువుల్ని కనెక్ట్ చేస్తూ నాలాలు ఉండేవి.. ఇప్పుడన్నీ ఆక్రమణలకు గురి కావడమే.. తరచూ వరదలు, రోడ్ల మునకలు.. భారీ ట్రా ఫిక్ జాం.. అన్ని పనులు వదిలి పెట్టీ ఉన్నతాధికారులు రోడ్ల పైకి పరుగు లు.. నెలలు తరబడి సమీక్షలు.. అన్ని సమస్యలకు విరుగుడు గొలుసుకట్టు నాలాల వ్యవస్థ పునరుద్ధరించడమే.

ఈదలకుంట నాలా దారి మళ్లింపు.. నాలా కనుమరుగు
X

దిశ, శేరిలింగంపల్లి : ఒకప్పుడు హైటెక్ సిటీ ఐటీ కారిడార్ చెరువుల్ని కనెక్ట్ చేస్తూ నాలాలు ఉండేవి.. ఇప్పుడన్నీ ఆక్రమణలకు గురి కావడమే.. తరచూ వరదలు, రోడ్ల మునకలు.. భారీ ట్రా ఫిక్ జాం.. అన్ని పనులు వదిలి పెట్టీ ఉన్నతాధికారులు రోడ్ల పైకి పరుగు లు.. నెలలు తరబడి సమీక్షలు.. అన్ని సమస్యలకు విరుగుడు గొలుసుకట్టు నాలాల వ్యవస్థ పునరుద్ధరించడమే. మాదాపూర్ లో మొండికుంట నిండితే అక్కడ నుంచి తమ్మిడి చెరువు, సున్నం చెరువు , మేడికుంట ద్వారా ఈదులకుంట లోకి నీరు ప్రవహిస్తుంది. ఒక చెరువు నిండి అలుగుపోస్తే, ఆ అదన పు నీరు మరొక చెరువుకు చేరేలా ని ర్మించిన కాలువలకు చెరబట్టారు. ఎ గువన ఉన్న మొండి కుంట నుంచి నీ టిని మోసుకొచ్చే ప్రధాన కాలువ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దారి మ ళ్లించారు. ఈదుల కుంటకు నీరు రా కుండా కుంట చుట్టూ పెద్ద కాంక్రీట్ నాలాను రూ.1.50 కోట్లతో నిర్మిం చారు. తమ్మిడికుంట నుంచి నీరు ఈ దుల కుంటకు కాకుండా.. నేరుగా కూకట్పల్లి చెరువులోకి వెళ్లేలా పక డ్బందీ ప్రణాళిక రచించారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే దాదాపు 1.50 కి.మీ. మేర నిర్మాణం చేసేశారు. ఇలా ఈదులకుంటను ఎండబెట్టి అందులో నిర్మాణాలకు ఉపక్రమించారు.కూకట్పల్లి పరిధిలోని కొన్ని యూఎల్సీ భూ ములు, ఈ చెరువు భూములు కలగలిసిపోయాయి. హద్దులు నిర్ధారించు కో కుండా, సరిహద్దులు వివాదాన్ని పట్టించుకోకుండా కూకట్పల్లి రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు ఎన్వోసీ జారీ చేశారు.

అక్కడ అసలు నీటి వనరులే లేవట..

అసలు అక్కడ నీటి వనరులు లేవని నీటిపారుదలశాఖ అధికారులు తేల్చే శారు. కేవలం ఒక నాలా మాత్రమే ఉందని, దాని బఫర్ జోన్ కూడా కేవలం 0.5 మీటర్లుగా ధ్రువీకరించడంతో ప్రైవేట్ వ్యక్తులు జీహెచ్ఎంసీ లో నిర్మాణ అనుమతులు పొంది చెరబడుతున్నారు. కుంటను రక్షించేందు కు ప్రభుత్వ యంత్రాంగం తగిన రికార్డులతో సన్నద్ధం అవుతున్నట్లు తెలు స్తోంది.. ఈ క్రమంలోనే ఈదులకుంట చెరువుకున్న సహజ సిద్ధమైన నాలాను మళ్లించిన వ్యవహారం వెలుగు చూ సింది.

పక్కా ప్రణాళికతో..!

దాదాపు 6.50 ఎకరాలున్న ఈదులకుంట చెరువును అర్బన్ ల్యాండ్ సీ లింగ్ భూములుగా చూపించి కొంత మంది ఇటీవల నిర్మాణాలు ప్రారంభించారు. ఈ చెరువు శేరిలింగంపల్లి మం డలం ఖానామెట్ గ్రామ పరిధిలో ఉం ది. 2014 తర్వాత జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వె ళ్లింది. తమ్మిడికుంట, ఈదుల కుంట, కూకట్పల్లి చెరువులను గొలుసుకట్టుగా నిర్మించారు. ఒకదాని తర్వాత మరొకటి నిండేలా ఏర్పాటు చేశారు.

తమ్మిడికుంట చెరువు నిండిన తర్వాత నీరు నాలా ద్వారా ఈదుల కుంటకు చేరుతుంది.

ఈ నాలా ఆధునికీకరణకు 2017-18 లోనే ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. దీంతో టెండర్లు పిలిచారు. కానీ మధ్యలో ఉన్న ప్రైవేటు భూముల యజమానులు అభ్యంతరం తెలిపినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

చెరువును చెరబడితే..

ఈ ప్రాంతంలోని గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఏర్పాటుకు ప్ర త్యేకత ఉంది. ఒక చెరువు నిండి అలుగుపోస్తే ఆ అదనపు నీరు మరొక చెరువుకు చేరేలా నిర్మించా రు. సువిశాల రోడ్ల కోసం, అత్యాధునిక వసతుల కోసం నగ రం నడిబొడ్డున ఉన్న చెరువులు, నాలాలను కప్పేస్తున్నారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పైసలు వస్తున్నాయని సంబర మే కానీ, భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించ డం లేదు. ఇలాంటి వారి అత్యాశ ఫలితమే.. చిన్న వర్షం కురిసినా నగరంలో వరద పోటెత్తుతోంది… ఈ సమస్య పరిష్కారంతోపాటు భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి.గత దశాబ్దా కాలంగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్‌ నగరాన్ని వెం టాడుతున్నాయి. ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయాలి : సీపీఎం

రూ.16 కోట్ల వ్యయంతో తమ్మిడి కుంట చెరువు సుందరీకరణ చేస్తున్నారు. ఈ చెరువు నిండితే నాల ద్వారా ఈదులకుంటకు చేరుతుంది. పక్క సర్వే నంబర్లు సహా యంతో సహజ సిద్ధంగా ఉన్న చెరువును కబ్జా చేస్తున్నా రు. కాలువ దారి మళ్లించిన రెవెన్యూ అధికారులు చ ర్యలు తీసుకోవడం లేదు.సర్వే నెంబర్ 7లో 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈదులకుంట ఉన్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గుర్తించి 22ఏ నిషేధిత జాబి తాలో పెట్టారు. 1954 కాశ్ర పహాని నుంచి భౌతికంగా నేటి వరకు చెరువు ఉన్నట్లు స్పష్టమైన ఆనవాళ్ళు ఉన్నాయని ఈదులకుంట చెరువు పరిరక్షణ కోసం పోరాడుతున్న సీపీఎం నాయకుడు శోభన్ స్పష్టం చేశారు. కూకట్ పల్లి సర్వే నెంబర్ పైన న్యాయస్థానం స్టే ఇచ్చింది. ప్రజా సంఘాలు,పర్యావరణవేత్తలతో కలిసి న్యాయ పోరాటం చేస్తాము. సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించాం. రాష్ట్ర ప్రభుత్వం చెరువుగా గుర్తించింది అని చెప్పడానికి రెవె న్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్‌వీఎస్ సంస్థ కూకట్పల్లి సర్వే నెంబర్లతో ఈదులకుంట కబ్జా చేసేం దుకు స్కెచ్ వేశారు. దానిని అడ్డుకొని తీరుతాం.

ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన ఎన్ఓసీ గోల్ మాల్‌పై వచ్చే కథనంలో..

Next Story