అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నాణ్యమైన సాంకేతిక వృత్తి విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్

by Kodari Anjali |

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు.

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నాణ్యమైన సాంకేతిక వృత్తి విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ముషీరాబాద్‌లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా సాంకేతిక వృత్తి విద్య కోర్సులను విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని అన్నారు. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన వృత్తి విద్య కోర్సులను అందించడం జరుగుతుందన్నారు.

మిషినింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ ఎనాలసిస్ డిజైనర్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాగే ఆటోమేషన్ ప్రాసెస్ కంట్రోల్ వంటి ఆరు ట్రేడ్స్ లలో విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కలక్టర్ కు వివరించారు. ఏటీసీలలో టెక్నికల్ ఎక్విప్మెంట్స్, అడ్మిషన్ల వివరాలు, నూతనంగా చేపట్టిన ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ లను కలెక్టర్ పరిశీలించి మిగిలి ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీజిల్ మెకానిక్, మోటర్ మెకానికల్ విభాగాలను సందర్శించి వివిధ యంత్రాల ద్వారా తయారు చేసిన పరికరాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి, తహసీల్దార్ ఏ. చందన, టెక్నికల్ ఆఫీసర్లు విశ్వ పాలక్ రెడ్డి, ఎండి ఆసిఫ్, కార్తీక్ కుమార్, మోహన్ బాబు, విజయ్ కుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story