- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. చంపాపేట్‌లో ప్రమాదకర మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్న ‘దిశ’ కథనానికి మరోసారి ఫలితం కనిపించింది.

దిశ, చంపాపేట్: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్న ‘దిశ’ కథనానికి మరోసారి ఫలితం కనిపించింది. చంపాపేట్ ప్రధాన రహదారిపై మూత లేకుండా ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్‌పై ‘దిశ’ ప్రచురించిన కథనానికి స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొద్ది రోజులుగా మ్యాన్‌హోల్ మూత దెబ్బతినడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మ్యాన్‌హోల్ కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ‘దిశ’ ప్రముఖంగా ప్రచురించడంతో సంబంధిత అధికారులు స్పందించి పనులను చేపట్టారు. మరమ్మతు పనుల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా బ్యారికేడ్లు, హెచ్చరిక కోన్స్ ఏర్పాటు చేసి దెబ్బతిన్న భాగాన్ని తొలగించి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పోషిస్తున్న పాత్ర అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, నగరంలోని ఇతర ప్రమాదకర ప్రాంతాలపై కూడా ఇదే తరహాలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న ‘దిశ’ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.






