అంబ‌ర్ పేట‌లో క‌ల్తీ వాట‌ర్ క‌ల‌క‌లం..!

by Nallavelli.Anjaneyulu |

న‌గ‌రంలో రోజుకొక క‌ల్తీ వ్యాపారం బ‌య‌ట‌ప‌డుతోంది. కాదేది క‌ల్తీకి అనర్హం అన్న‌ట్టు ఉంది ప్ర‌స్తుత ప‌రిస్థితి.

అంబ‌ర్ పేట‌లో క‌ల్తీ వాట‌ర్ క‌ల‌క‌లం..!
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : న‌గ‌రంలో రోజుకొక క‌ల్తీ వ్యాపారం బ‌య‌ట‌ప‌డుతోంది. కాదేది క‌ల్తీకి అనర్హం అన్న‌ట్టు ఉంది ప్ర‌స్తుత ప‌రిస్థితి. ఇప్ప‌టివ‌ర‌కు పండ్లు, పాలు, అల్లంపేస్ట్, టీపొడి, నూనెలు, నెయ్యి వంటివి క‌ల్తీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా తాగే నీటిని కూడా క‌లుషితం చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబ‌ర్ పేట‌లో చోటు చేసుకుంది. క‌లుషిత నీటిని ఏమాత్రం శుద్ధి చేయ‌కుండా నేరుగా ప్యాకెట్ల‌లో నింపుతున్నారు కేటుగాళ్లు. అంబ‌ర్ పేట‌లో అక్ర‌మంగా క‌ల్తీ మంచినీటి వ్యాపారం నిర్వ‌హిస్తున్నార‌నే స‌మాచారంతో ప‌లు వాట‌ర్ ప్లాంట్ల పై మంగ‌ళ‌వారం సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుస్తున్న వాట‌ర్ ప్లాంట్ల‌ను సీజ్ చేశారు. అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో ప్లాంట్ల‌లో నీరు లీకేజీ కావ‌డం..పాకూరు ప‌ట్టి ఉండటం చూసి నివ్వెర‌పోయారు అధికారులు. నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story