- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవి సీతారాంకు దేవులపల్లి రామానుజరావు పురస్కారం
తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రతి ఏటా ప్రదానం చేసే డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు పురస్కారానికి ఈసారి ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ ఆర్.సీతారాం ఎంపికయ్యారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రతి ఏటా ప్రదానం చేసే డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు పురస్కారానికి ఈసారి ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ ఆర్.సీతారాం ఎంపికయ్యారు. ఇదిగో ఇక్కడిదాకే, సన్నాఫ్ మాణిక్యం, కుప్పం కవితలు వంటి కవితా సంపుటాలు, అదే పుట మొదలైన విమర్శ వ్యాస సంపుటాలు, పరిశోధన గ్రంథాలు ఆయన వెలువరించారు. ప్రస్తుతం ఖమ్మం ఎస్సార్ అండ్ బిజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గతంలో కాళోజీ పురస్కారం అందుకున్నారు. ఈనెల 24న దేవులపల్లి రామానుజరావు 107వ జయంతి సందర్భంగా పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ కె.లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సీతారామ్ ను రూ .25వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తారని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు.
- Tags
- Sitaram






