- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొటానికల్ గార్డెన్‌కు పూర్వ వైభవం
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 46 ఎకరాల్లో నెలకొల్పిన బొటానికల్ గార్డెన్ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారింది. ప్రస్తుత యూనివర్సిటీ యాజమాన్యం సంవత్సర కాలం నుంచి బొటానికల్ గార్డెన్‌ను పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కోసం కృషి చేస్తోంది.

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 46 ఎకరాల్లో నెలకొల్పిన బొటానికల్ గార్డెన్ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారింది. ప్రస్తుత యూనివర్సిటీ యాజమాన్యం సంవత్సర కాలం నుంచి బొటానికల్ గార్డెన్‌ను పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కోసం కృషి చేస్తోంది. సెప్టెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ బొటానికల్ గార్డెన్ నుంచే వనమహెూత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదే రోజు హెచ్ఎండీఏ సహకారంతో మూడు ఎకరాలలో 1500 వివిధ రకాల అటవీ జాతి మొక్కలను నాటారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్‌తో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ గ్రాంటుల సహకారంతో బొటానికల్ గార్డెన్‌తోపాటు ఇతర ఖాళీ ప్రదేశాలలో అటవీ, సంప్రదాయేతర పండ్ల మొక్కలను నాటించే కార్యక్రమం విస్తృతంగా చేపడుతోంది.
శనివారం బొటానికల్ గార్డెన్‌లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ ఆర్సీజీఎం సహకారంతో నిర్మాణ్ సంస్థ, విశ్వవిద్యాలయం వివిధ ఔషధ మొక్కల వనం ఏర్పాటులో భాగంగా 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతితోపాటు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, వర్సిటీ ఉన్నతాధికారులు, ఆగ్రో ఫారెస్ట్రీ విభాగాధిపతి, ఆర్సీజీఎం ప్రతినిధులు మణిదీప, సుజిత, నిర్మాణ్ సంస్థ నుంచి మయూర్, తిరుపతి పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది, ఆర్సీజీఎం వలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.






