- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం
by Malleboina Mahesh |
స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు (School bus)లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం అయింది. ఈ షాకింగ్ ఘటన బుధవారం మధ్యాహ్నం.. చంద్రాయణ గుట్ట లక్ష్మీ గూడ వాంబే కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ హరి ప్రసాద్ (Driver Hari Prasad) వెంటనే అప్రమత్తమై.. బస్సును పక్కకు ఆపేశాడు. వెంటనే బస్సులో ఉన్న విద్యార్థులను కిందకి దించాడు. దీంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. అయితే అంతా చూస్తుండగా ఆ స్కూల్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏది ఏమైనప్పటికి డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు.
Next Story






