- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలు నగరాన్ని కమ్మేసిన చీకట్లు.. బీ కేర్ఫుల్ అంటున్న బల్దియా
గత నాలుగు రోజుల నుంచి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత నాలుగు రోజుల నుంచి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. కాగా నేడు కూడా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఉదయం నుండి హైదరాబాద్ నగరాన్ని దట్టమైన మబ్బులు కమ్మేశాయి. మిట్ట మధ్యాహ్నం వేళ చిమ్మచీకట్లు కమ్ముకొని సందెవేళను తలపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD), తెలంగాణ వెదర్‌మ్యాన్ వంటి స్థానిక వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించాయి. కుకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో 25-40 మి.మీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ రోజు సెలవు దినం కావడంతో, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి కాలు బయట పెట్టకూడదని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్స్ జారీ చేసారు. భారీ క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. నగరంతోపాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సిద్దిపేట్, వికారాబాద్‌లలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.






