- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు వాటిపై పడ్డారా అంతే సంగతులు..!
చూసుకోకుండా కూర్చున్నా , ప్రమాదవశాత్తు వాటిపై పడిన అంతే సంగతులు.. పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది..

దిశ, ఖైరతాబాద్ : చూసుకోకుండా కూర్చున్నా , ప్రమాదవశాత్తు వాటిపై పడిన అంతే సంగతులు.. పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది.. వివరాల్లోకి వెళితే పంజాగుట్ట ద్వారకపురి కాలనీ రోడ్డులో మోడల్ హౌస్ సమీప ప్రాంతంలోని ఉన్న మోడల్ ఫర్నిచింగ్ భవనం ముందు ప్రహారీగా ఏర్పాటు చేసుకున్న రైలింగ్ ప్రమాదకరంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.. పదునైన రైలింగ్ అదికూడా దిగువ స్థాయిలో చుటూ ప్రహరీల ఏర్పాటు చేసుకున్నారు..ద్వారకాపురి కాలనీ రోడ్డు ఎప్పుడూ ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది.. అక్కడ సెల్యులార్ లో జిరాక్స్ షాపు ఉంది , ఎదురుగా హోటల్లు , చాయ్ దుకాణాలు ఉంటాయి..అక్కడికి చాలా మంది వస్తుంటారు.
కాసేపు చాయ్ తాగుతూ కొంతమంది టైం స్పెండ్ చేస్తూ ఫోన్లు మాట్లాడుతుంటారు. మరి కొంతమంది అక్కడే వాహనాలను పార్క్ చేస్తుంటారు. అనుకోకుండా అలా గోడకు ఒరిగిన , వాటిపై కూర్చున్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. వర్షం పడినప్పుడు అక్కడ అనుకోని ఉన్న రోడ్డు అంత కూడా నీటమయం అవుతుంది అర్ధ రాత్రుళ్ళు చూసుకోకుండా
అటుగా వెళ్లే పాదచార్యులు ప్రమాదవశాత్తు వాటి పైన పడితే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం కనిపిస్తోంది అని ఏవైనా ప్రమాదం జరిగితే కానీ ఇలాంటివి అధికారులకు కంట్టపడవ అంటూ పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ప్రమాదకరమైన రైలింగ్ ను తొలగించాలని పలువురు అభిప్రాయాలు తెలుపుతునారు..
సరస్ చంద్రిక న్యాయవాది :
దిగువ స్థాయిలో ఏర్పాటు చేసిన రైలింగ్ అటుగా వెళ్లే పాదచార్యులకు , వృద్ధులకు , జంతువులకు , ప్రమాదవశాత్తు వాటిపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి వాటినిని తొలగించాలి లేదంటే ప్రహరి ఎత్తును పెంచుకోవాలి అని సరస్ చంద్రిక న్యాయవాది అభిప్రాయం తెలిపారు…






