హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్

by Muthe.Rajitha |

గత వారం రోజులనుంచి హైదరాబాద్(Hyderabad Rains) వాసులను బెంబేలేత్తిస్తున్న వర్షాలు సోమవారం కూడా మరోసారి డేంజర్ బెల్స్ మోగించాయి.

హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : గత వారం రోజులనుంచి హైదరాబాద్(Hyderabad Rains) వాసులను బెంబేలేత్తిస్తున్న వర్షాలు సోమవారం కూడా మరోసారి డేంజర్ బెల్స్ మోగించాయి. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోయిన్‌పల్లి, అల్వాల్, బొల్లారంలో వాన ముంచెత్తుతోంది. నగరంలో మరో రెండు గంటలపాటు ఈ వర్షాలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించడంతో మాన్సూన్ బృందాలు ఎక్కడికక్కడ అప్రమత్తం అయ్యాయి.

రాత్రి 9 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఇళ్లనుంచి బయటికి రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అధికారులు సూచించారు. కాగా నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి.

Next Story