డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితులను మోసగించిన సైబర్ కేటుగాళ్లు

by Ratna Kumari |

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ₹60 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితులను మోసగించిన సైబర్ కేటుగాళ్లు
X

దిశ, శేరిలింగంపల్లి : సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ₹60 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ భయబ్రాంతులకు గురి చేశారు.మోసగాళ్లు లక్నోలోని యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. ₹2.55 కోట్ల మనీలాండరింగ్ కార్యకలాపాల నిర్వహించారని బయటపెట్టారు.ఆధార్ కార్డు నెంబర్ చెప్పడంతో పాటు కర్ణాటకలో బ్యాంకు ఖాతా నెంబ‌ర్ చెప్పి మరింత నమ్మించారు. ఏటిఎస్ అధికారిగా నటిస్తున్న ప్రేమ్ నాథ్ గౌతమ్ తో సహా నకిలీ అధికారులను పరిచయం చేశాడు.


మనీలాండరింగ్, ఉగ్రవాద సంబంధిత నేరాలతో కూడిన ఒక కల్పిత నేర పూరిత కుట్రలో ఇరికించారు. వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. అందులో పోలీసు యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి, దర్యాప్తు అధికారిగా నటిస్తూ, బాధితుడు సహకరించకపోతే తక్షణ అరెస్టు చేస్తామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించాడు.అతడిని "డిజిటల్ అరెస్టు" పేరుతో అరెస్ట్ చేశారు. బాధితుడిని నిరంతరం భయపెడుతూ, కుటుంబ సభ్యులుతో సహా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పొద్దాన్నారు. మోసగాడు సూచించిన నంబర్ ద్వారా మాత్రమే మాట్లాడమని బలవంతం చేశారు. మరింత బెదిరించేందుకు నకిలీ అరెస్టు ఉత్తర్వులు, ఎన్ఐఏ కేసు రికార్డులు, కల్పిత RBI ధృవీకరణ నోటీసులు వాట్సాప్ ద్వారా పంపించారు. ఏఐ వీడియో కంటెంట్‌ను ఉపయోగించారు.


నిరంతర మానసిక ఒత్తిడికి గురిచేసి ఆర్బిఐ, RBI , యాంటీ-మనీ లాండరింగ్ ధృవీకరణ అనే సాకుతో, బాధితుడికి చెందిన వివిధ బ్యాంకుల నుంచి పలు దపాలుగా 60 లక్షలు తమ ఖాతాలలోకి మళ్ళించుకున్నారు. కేసు ధృవీకరణ లాంఛనాలు పూర్తయిన తర్వాత చెల్లించిన నగదు వాపసు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లను రద్దు చేసి, అందులోని సొమ్మును బదిలీ చేయమని బాధితుడిని మరింతగా బలవంతం చేశారు. మోసపోయామని తెలుసుకున్న తర్వాత బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిందితులు బ్యాంకు ఖాతాలు తెరిచి, ఆ నిధులను క్రిప్టోకరెన్సీగా మార్చి, మోసగించిన డబ్బును సైబర్ మోసగాళ్లకు బదిలీ చేసిన కేటుగాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ ఆయన వారిలో షేక్ రెహన బేగం, అల‌జంగి ర‌వి, మ‌హ్మద్ జాఫ‌ర్, కొల్లా వెంక‌ట అచ్యుత రావు ను అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు.

Next Story