స్మార్ట్‌ఫోన్ లో బిగ్ స్కాం.. 2.43 కోట్లకు మాయల మాంత్రికులు..!

by Bhanu |   (  Updated:2025-05-01 14:05:41  IST  )

పెట్టుబడికి భారీ లాభాలంటూ హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని 2.43 కోట్లు మోసం చేసిన కేసులో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను ఇచ్చిన మహారాష్ట్రకు చెంది ఓ డ్రైవర్ ను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

స్మార్ట్‌ఫోన్ లో బిగ్ స్కాం.. 2.43 కోట్లకు మాయల మాంత్రికులు..!
X

దిశ, సిటీక్రైం : పెట్టుబడికి భారీ లాభాలంటూ హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని 2.43 కోట్లు మోసం చేసిన కేసులో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను ఇచ్చిన మహారాష్ట్రకు చెంది ఓ డ్రైవర్ ను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నగరానికి చెందిన 56 సంవత్సరాల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రాం, వాట్సాప్ కాల్స్ ద్వారా పరిచయం చేసుకున్నారు. మా ద్వారా పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి అతనిని సామ్ కో సెక్యురిటీస్, ఐఐఎఫ్ ఎల్ కంపెని ల పేరుతో ఉన్న అప్లికేషన్ లను డౌన్ లోడ్ చేయించి అతనికి ఐడి, పాసువర్డ్ లను ఇచ్చారు. ఆ తర్వాత చిన్న చిన్న పెట్టుబడులకు వెంటనే లాభాలను వేశారు.


అలా నమ్మించి మొత్తం 2.43 కోట్ల రూపాయాలను పెట్టుబడిగా వసూలు చేశారు. ఆ తర్వాత అతనికి కేటాయించిన ఐడి లో లాభాలు భారీగా కనపడుతున్నాయి కాని విత్ డ్రా కు ప్రయత్నించినప్పుడు ఇంకా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేశారు. మోసంపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నగదు బదిలీ అయిన ప్రక్రీయను అనుసరించి మహారాష్ట్రకు పూణే ప్రాంతానికి చెందిన డ్రైవర్ గురుజోత్ సింగ్ ను అరెస్టు చేశారు. విచారణలో అతను ఇలాంటి మోసాల పై నమోదైన కేసులలో అనుమానితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను కమీషన్ ల మీద ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


Next Story