క్రికెట్ అభిమానుల‌ను దోచుకునేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు బిగ్ స్కెచ్

by Ratna Kumari |

ఈ నెల 22న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జరగనున్న సన్ రైజర్స్ వ‌ర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు బిగ్ స్కెచ్ వేశారు.

క్రికెట్ అభిమానుల‌ను దోచుకునేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు బిగ్ స్కెచ్
X

దిశ, సిటీక్రైం : ఈ నెల 22న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జరగనున్న సన్ రైజర్స్ వ‌ర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు బిగ్ స్కెచ్ వేశారు. తక్కువ ధరకే టికెట్ లు ఇస్తామని బురిడి కొట్టించేందుకు నకిలీ యాప్ లు, వెబ్ సైట్ లను రూపొందించి వాటిని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. అభిమానులు ఇలాంటి ఫేక్ యాప్, వెబ్ సైట్ ల లింక్ లను క్లిక్ చేయొద్దని, వాటిలో మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ విషయాలను నమోదు చేసుకోవద్దని సూచించారు. అధికారికంగా ఐపీఎల్ టికెట్ లను విక్రయించే డిస్ట్రిక్ యాప్ ను అచ్చం పోలి ఉండే విధంగా సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్ లను తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సజ్జనార్ అభిమానులను అప్రమత్తం చేశారు. నకిలీ యాప్ లు , వెబ్ సైట్ ల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనధికార లింక్ లను అసలు టచ్ చేయొద్దని తెలిపారు.

Next Story