- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలిక పై అత్యాచారం కేసులో కీలక తీర్పు
బాలిక పై అత్యాచారం కేసులో నాంపల్లి అదనపు సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

దిశ, చంపాపేట్: బాలిక పై అత్యాచారం కేసులో నాంపల్లి అదనపు సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. చాదర్ ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగం మనోహర్(20) నిందితుడు ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలికను భయపెట్టి దారుణాలకు ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక సెప్టెంబర్ 25, 2021న ఫిర్యాదు చేసింది. దీంతో అతని పై ఎస్సీపీసీ No. 55/2022 (సీఆర్ .No. 320/2021) కేసులో, ఐపీసీ సెక్షన్లు 376(3), 354(సి ), 506తో పాటు పోక్సో చట్టం 2012 సెక్షన్ 5(L) r/w 6, ఎస్సీ /ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 సెక్షన్ 3(2)(V), ఐటి చట్టం 2000 సెక్షన్ 67 కింద కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా బాలిక పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు రుజువు అయింది. ఇంతటితో ఆగకుండా బాధితురాలుకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి బంధువులకు పంపిస్తూ బెదిరింపులకు దిగాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలుని ఒత్తిడి చేయడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా బెదిరించినట్టు దర్యాప్తులో వెల్లడి అయిందని పోలీసులు తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి టి. అనిత నిందితుడిని దోషిగా తేల్చి.. 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 6 నెలల అదనపు జైలు శిక్ష విధించారు. బాధితురాలు వయస్సు, ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకొని బాధితురాలుకి రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు సిఫారసు చేసింది. ఈ కేసు అదనపు డీసీపీ(రిటైర్డ్) దేవేందర్ దర్యాప్తు చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రామ్ రెడ్డి, జే. రామకృష్ణ వాదనలు వినిపించారు. చాదర్ ఘాట్ పోలీసుల కృషితో బాధితురాలికి న్యాయం జరిగినట్టు అధికారులు తెలిపారు.






