వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీపై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by velandi.Saikiran |

హైదరాబాద్ లో శాంతి భద్రతలను సమర్ధవంతంగా నిర్వహించడంలో పీస్ అండ్ వెల్ ఫేర్ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారనిసీవీ ఆనంద్

వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీపై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో శాంతి భద్రతలను సమర్ధవంతంగా నిర్వహించడంలో పీస్ అండ్ వెల్ ఫేర్ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ పీస్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు, పీస్ కమిటీ సభ్యులు కలిసి పనిచేయాలని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో 1500 మంది పీస్ కమిటీ సభ్యులు ఉన్నారని వీరి సేవలను పోలీసులు ఉపయోగించుకుని పండుగలకు సురక్షితమైన వాతావరణం ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ నగరానికి ఉన్న గంగా-జమున-తెహజీబ్ ప్రతిష్టను నిలబెట్టాలని సీపీ కోరారు.

Next Story