మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు నిరంత‌రం కృషి చేస్తా : కార్పొరేట‌ర్ శ్వేత మ‌ధుక‌ర్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు నిరంత‌రం కృషి చేస్తాన‌ని కార్పొరేట‌ర్ శ్వేత మ‌ధుక‌ర్ రెడ్డి తెలిపారు.

మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు నిరంత‌రం కృషి చేస్తా : కార్పొరేట‌ర్ శ్వేత మ‌ధుక‌ర్ రెడ్డి
X

దిశ, చంపాపేట్ : మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు నిరంత‌రం కృషి చేస్తాన‌ని కార్పొరేట‌ర్ శ్వేత మ‌ధుక‌ర్ రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం ఐ.ఎస్. సదన్ డివిజన్ పరిధిలోని నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్)లో శివాజీ మహారాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చింతల్ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా తనకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా పనిచేస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. నిర్మించబోయే ఈ కమ్యూనిటీ హాల్‌ను పేద ప్రజల వివాహాలు, చిన్న చిన్న సామాజిక కార్యక్రమాల కోసం ఉచితంగా వినియోగించుకునేలా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.ఈ ప్రాంతంలో సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు, ఆర్థికంగా బలహీన వర్గాలకు తోడ్పాటుగా ఈ కమ్యూనిటీ హాల్ నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రఘుపతి నాయక్, దాండుగుల కృష్ణ, శేఖర్, రవి, యాదయ్య, బాలు, ఇద్దయ, రేణుక, భారతి, కొంటి, గంగమ్మ, సకూ, వినోద్, నాగరాజ్, శ్రీకాంత్, శివ, ఆంజనేయులు, జలందర్, దేవి, లాల్, విశాల్ గౌడ్, సందీప్ సాగర్ పాల్గొన్నారు.

Next Story