- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై వివాదం.. బీజేపీ నేత వ్యాఖ్యలు చర్చనీయాంశం
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

దిశ, చంపాపేట్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ శ్రీరాముడు, లక్ష్మణుడు వంటి హిందూ దేవతలపై వ్యంగ్యంగా మాట్లాడినట్లు ఆరోపిస్తూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
“ప్రకాష్ రాజ్ కి ఎవరైనా హాని చేస్తే దానికి నేను బాధ్యత వహిస్తాను” అని పేర్కొనడం వివిధ వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అలాగే ఆయనను సినీ పరిశ్రమలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన షూటింగ్‌లు ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై పౌరసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభివ్యక్తి స్వేచ్ఛను కాపాడాలని, హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమైనవే అయినప్పటికీ, వాటిని వ్యక్తం చేసే విధానం బాధ్యతాయుతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.





