- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటళ్లలో కలుషితమైన ఆహారం.. హెచ్ -ఫాస్ట్ కు రోజుకు 30 ఫిర్యాదులు
నగరంలో హోటల్స్, రెస్టారెంట్ లలో భోజనం తినాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. హోటల్స్, రెస్టారెంట్ ల నిర్వాహకుల తీరుతో డబ్బులు చెల్లించి జబ్బులను కొనుగొలు చేసుకున్నట్లుగా స్పష్టం మవుతోంది.

దిశ, సిటీక్రైం : నగరంలో హోటల్స్, రెస్టారెంట్ లలో భోజనం తినాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. హోటల్స్, రెస్టారెంట్ ల నిర్వాహకుల తీరుతో డబ్బులు చెల్లించి జబ్బులను కొనుగొలు చేసుకున్నట్లుగా స్పష్టం మవుతోంది. ఎవరైనా ఆహారానికి సంబంధించిన కలుషితం పై నిలదీస్తే తింటే తిన్నండి లేదంటే వెళ్ళిపోండంటూ అందరి ముందు అవమానపర్చేలా హోటల్ నిర్వాహకులు వ్యవహరిస్తుంటారు. నిలదీస్తే ఈ నిర్వాహకులు హోటల్స్ లలో పని చేసే సిబ్బందితో కలిసి దాడికి కూడా వెనకాడారు. హైదరాబాద్ నగరంలో పరిశుభ్రమైన హోటల్స్ దొరకడం చాలా అరుదుగా మారిపోయింది. ఇక రోడ్ల పై ఉండే టిఫిన్ సెంటర్ లు, మిర్చి బజ్జీ కేంద్రాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, టీ పాయింట్ ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటి వరకు ఈ అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్న హోటల్స్ పై ఎవరు దృష్టి పెట్టలేదు. ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ -ఫాస్ట్(హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం) ఏర్పాటుతో హోటల్స్, రెస్టారెంట్ ల నిర్వాహకుల్లో కొంత అలజడి మొదలైంది. దీనికి తోడు పౌరులు కూడా ముందుకు వస్తుండడంతో హోటల్స్ యాజమాన్యాల్లో కొంత ఆందోళన మొదలైంది. అయితే హెచ్ ఫాస్ట్ తో పాటు ఫుడ్ సేఫ్టీ టీం లను మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటే హైదరాబాద్ బిర్యాని, తో పాటు ఇతర ఫుడ్ కు ఉన్న క్రేజ్ మరింత పెరిగి సేఫ్ ఫుడ్ సిటీగా హైదరాబాద్ ముద్ర వేసుకుంటుందని నగర పౌరులు ఆశిస్తున్నారు.
రోజుకు 30 ఫిర్యాదులు..
"నాకు కుళ్ళిన బిర్యాని పెట్టారు. నా ఫ్రైడ్ రైస్ లో బొద్దింక పడింది. సాంబార్ లో ఈగ పడింది. ఇలా హెచ్ -ఫాస్ట్ కు ప్రతి రోజు 30 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కల్తీ ఆహార్ పదార్ధాలను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన హెచ్ -ఫాస్ట్ కు ఫిర్యాదు చేయడానికి ఓ ప్రత్యేక నెంబరును పౌరుల కోసం కేటాయించారు. 8712661212 ఈ నెంబరుకు కల్తీ ఆహార పదార్ధాల తయారీ, అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్ లు, కలుషితమైన ఆహార పదార్ధాల గురించి ఫిర్యాదులు చేయాలని సీపీ సజ్జనార్ హెచ్-ఫాస్ట్ ప్రారంభం సందర్భంగా కోరారు. ఈ నెంబరుకు హోటల్స్ , రెస్టారెంట్ లలో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణంతో పాటు కుళ్ళిన, కలుషితమైన ఆహార అంశంలో పౌరులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందుకున్న హెచ్-ఫాస్ట్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అక్కడి పరిస్థితులను ఆహార పదార్ధాల నిల్వ, తయారీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కల్తీ జరిగినట్లు నిర్ధారణ చేసుకుని వాటి వివరాలను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు హెచ్-ఫాస్ట్ ఏర్పాటైన 35 రోజుల్లో 20 కి పైగా హోటల్స్ పై కేసులను నమోదు చేశారు.
గోలి సోడా, ఐస్ క్రీంలు కూడా కల్తీ
హెచ్ -ఫాస్ట్ ఎండకాలాన్ని దృష్టి లో పెట్టుకుని గోలిసోడా, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ పై ఫోకస్ పెట్టింది. దీంతో ఐస్ క్రీం తయారీకి సింథటిక్ పాలను వాడుతున్నారని గుర్తించారు. ఇక గోలిసోడా, కూల్ డ్రింక్స్ లలో కూడా రసాయానాలతో కూడి కలర్స్ ను వాడుతున్నట్లు హెచ్ ఫాస్ట్ పోలీసులు పసిగట్టారు. ఇలా వీటిని కల్తీ చేస్తున్న దాదాపు 15 ఐస్ క్రీం పార్లర్లు నాలుగు గోలిసోడా పాయింట్ లను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో ఎక్కడైనా కల్తీ ఆహార పదార్ధాల తయారీ అడ్డాలు, కుళ్ళిపోయిన ఆహారం పెడుతున్న హోటల్స్ లపై సమాచారం ఉంటే హెచ్ ఫాస్ట్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని హెచ్-ఫాస్ట్ ఇన్స్ పెక్టర్ రంజిత్ గౌడ్ తెలిపారు. కల్తీ ఆహార పదార్ధాలు, కలుషితమైన ఆహారాన్ని పెట్టే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.






