నగరంలో కంటైనర్ ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

by Malleboina Mahesh |

నగరంలో కంటైనర్ ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

నగరంలో కంటైనర్ ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో కంటైనర్ ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని దబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లో కార్లను డెలివరీ చేసే నిమిత్తం నెల్లూరు నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఒక కంటైనర్, అక్కడ ఉన్న గ్యాంట్రీ హైట్ బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. కంటైనర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో అది హైట్ బ్యారియర్ వద్ద చిక్కుకుపోయింది. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో, అతని బదులు క్లీనర్ వాహనాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అనుభవం లేని క్లీనర్ అతివేగంగా కంటైనర్‌ను నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Next Story