- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ
దిశ, జూబ్లీహిల్స్: నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ రాజకీయ (కక్షను) మొండి వైఖరిని ఖండిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలో

దిశ, జూబ్లీహిల్స్: నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ రాజకీయ (కక్షను) మొండి వైఖరిని ఖండిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలో భాగంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ కేసుల ద్వారా వేధిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , కార్పొరేటర్ సి. ఎన్ రెడ్డి , సంజయ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






