- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చిన సీట్లు ఇవే..!
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సాగింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సాగింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా బీఆర్ఎస్‌కు 39 సీట్లు, బీజేపీకి 8, ఎంఐఎం-7, సీపీఐ-1 స్థానంలో విజయం సాధించాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్-10, బీఆర్ఎస్-2, ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ -8, సీపీఐ-1, బీఆర్ఎస్-1, నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్-11, బీఆర్ఎస్-1 స్థానంలో గెలుపొందింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ -2, మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్-3, బీఆర్ఎస్-7, రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్-4, బీఆర్ఎస్-10, హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్-7, ఎంఐఎం-7, బీజేపీ-1, కరీంగనర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ -8, బీఆర్ఎస్-5, నిజామాబాద్ జిల్లాలో 9 నియోజవకర్గాలకు గాను కాంగ్రెస్-4, బీఆర్ఎస్-2, బీజేపీ-3, ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ -4, బీఆర్ఎస్-2, బీజేపీ-4 స్థానాల్లో విజయం సాధించాయి.
Read More..
తెలంగాణలో తప్పిన ‘ఉప’ ఎన్నిక.. ఎవరూ ఊహించని తీర్పిచ్చిన మూడు నియోజకవర్గాల ఓటర్లు..!






