- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ డిమాండ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోరుతూ ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ నాయకులు బయలు దేరారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలో చేపట్టనున్న భారీ ధర్నాలో పాల్గనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లో సోమవారం ఢిల్లీకి బయలు దేరారు. ఈ ప్రత్యేక రైళ్లో ఏఐసీసీ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి నాగపూర్ వరకు ప్రయాణించన్నారు. ఢిల్లీకి రైళ్లో వెళ్లిన కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను, కార్యకర్తలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. దీన్ని పార్లమెంట్ లో అమోందించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో చేపట్టిన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తునా సన్నహాకాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర నుంచి కార్యక్తలను పెద్ద ఎత్తునా తరలించారు.
ఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రత్యేక ఉద్యమ కార్యక్రమాలు
ఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రత్యేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5, 6, 7 తేదీలలో ఢిల్లీ కేంద్రంగా బీసీ రిజర్వేషన్ల పోరాటం ఉదృతం చేయనున్నారు. ఆగస్టు 5న పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి టీపీసీసీ నేతలు పోరాటం చేస్తారు. ఆగస్టు 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా భారీ ధర్నా. తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఆగస్టు7న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి సమర్పిస్తూ వినతిపత్రాలు అందజేస్తారు.






