- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్టుగూడ స్మశానవాటిక కబ్జాపై కాంగ్రెస్ ఫిర్యాదు
మెట్టుగూడ డివిజన్‌లో ఉన్న స్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

దిశ, సికింద్రాబాద్ : మెట్టుగూడ డివిజన్‌లో ఉన్న స్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆడం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో డీసీసీ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారుకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రజలు అంత్యక్రియల కోసం ఉపయోగిస్తున్న స్మశానవాటిక స్థలాన్ని మాజీ కార్పొరేటర్ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రజల అవసరాలకు కేటాయించిన పవిత్ర స్థలాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు
స్మశానవాటిక అనేది ప్రతి మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అని, అలాంటి ప్రదేశాన్ని కూడా రాజకీయ స్వార్థాలకు వాడుకోవడం మానవత్వాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. అలాగే స్మశానవాటిక పరిసరాల్లో వందేళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షాన్ని నరికివేసి స్థలాన్ని ఆక్రమించుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఉన్న వృక్షాన్ని నాశనం చేయడం ద్వారా పర్యావరణానికి నష్టం వాటిల్లిందని అన్నారు. అనుమతి లేకుండా వృక్షాలను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై అధికారులు స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మెట్టుగూడ ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.






