- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల నిర్వహణకు శిక్షణ తరగతులు చేపట్టండి: జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
డిసెంబర్ 7న జరిగే మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశించారు.

దిశ, కార్వాన్: డిసెంబర్ 7న జరిగే మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని సరోజినీ దేవి వనిత విద్యాలయం, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ విభాగంలోని పలు గదులను డిసిపి శిల్పవల్లి, జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 7న నిర్వహించనున్న ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్లాక్‌ల వారీగా భారీకేటింగ్ చేపట్టాలని, అన్ని కేంద్రాల వద్ద త్రాగునీరు, నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలని అలాగే సెల్ ఫోన్స్, పెన్నులు ఇతర వస్తువులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని దూరంగా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అలాగే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ విభాగంలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ పక్కనే ఉండేటట్లు ఏర్పాట్లు ఉండాలని ఆమె సూచించారు. పోలింగ్ రోజున ఇన్ -అవుట్ ఎంట్రన్స్ గేట్లు మాత్రమే ఉపయోగించాలని మిగిలినవి మూసివేయాలని సూచించారు. అలాగే సీనియర్ సిటిజెన్లకు ఎన్నికల రోజున ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పిఓ, ఎపిఓలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం సత్వరమే చేపట్టాలని ఆమె సూచించారు. తదుపరి రెండు భవనాలలో గదులను, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి అధికారులకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారావు, డి సి ఓ ప్రసన్న, ఏసీపీ ప్రవీణ్ కుమార్, తాసిల్దార్ నయీముద్దీన్ సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






