- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు..
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు మరో కాంగ్రెస్ నాయకుడు భీమిడి రామకృష్ణరెడ్డిని హెచ్చరించారు.

దిశ, చైతన్యపురి: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు కె. శివకుమార్, ఉపాధ్యక్షుడు సామలేటి సాయిరామ్ లు మరో కాంగ్రెస్ నాయకుడు భీమిడి రామకృష్ణరెడ్డిని హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఎల్బీనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్క్రిప్ట్ వీడియోలు చూస్తూ మా నాయకుడిని తిట్టే స్థాయి భీమిడి రామకృష్ణారెడ్డికి లేదన్నారు. అసలు ఈనియోజకవర్గంలో నీకు ఓటు హక్కు ఉందా నీవు గడిచిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికలలో ఎక్కడున్నావని ప్రశ్నించారు. నీవు శివచరణ్ రెడ్డి పై చేసే ఆరోపణలపై స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని నీసంగతి చూస్తామని పేర్కొన్నారు. స్థాయిని మించి మాట్లాడడం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పని మానుకోవాలని హితవు పలికారు. మరోసారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. శివచరణ్ రెడ్డి పై అవాకులు చెవాకులు పేలితే సహించేదిలేదన్నారు. నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈసమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాముయాదవ్, సోషల్ మీడియాఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి తిరుపతి నాయక్, చైతన్యపురి డివిజన్ ఇంచార్జి ఉదయ్ కిరణ్, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.






