సమాజ మార్పుకు పాటలే ఆయుధాలు: శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

by Kodari Anjali |

తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ప్రజా చైతన్య ఉద్యమాలలో పాటలే కీలక పాత్ర పోషించాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అన్నారు.

సమాజ మార్పుకు పాటలే ఆయుధాలు: శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
X

దిశ, రవీంద్ర భారతి: తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ప్రజా చైతన్య ఉద్యమాలలో పాటలే కీలక పాత్ర పోషించాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, ప్రజాకవి కల్వకోలు మద్దిలేటి రచించిన వనమంచు పల్లె పాటల పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యుదయ రచయితల సంఘం ఎల్లవేళలా పిడిత ప్రజల పక్షాన నిలిచే సాహిత్యాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న మాట్లాడుతూ, పాట అనేది కేవలం అక్షరాల కూర్పు కాదని అది సమాజపు అంతరంగాన్ని రగిలించే అగ్ని కణమని పేర్కొన్నారు. రచయిత రాసిన ప్రతి పాటలోనూ సామాజిక దృక్పథం, పల్లెసంస్కృతిపై మక్కువ కనిపిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీరస్వామి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏం బాల నరసింహ, రాజ్యాంగ రక్షణ దళ్ తెలంగాణ అధ్యక్షులు రాజేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు విజయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Next Story