- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెక్ బౌన్స్ కేసులో హింసించారని .. కాలనీ అధ్యక్షుడి ఆత్మహత్య
చెక్ బౌన్స్ కేసులో హింసించారని, కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వనస్థలిపురం : చెక్ బౌన్స్ కేసులో హింసించారని, కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీప్రియ కాలనీలో అధ్యక్షుడు మధు ఆత్మహత్య చేసుకున్నాడు. చెక్ బౌన్స్ కేసు విషయంలో బోడ యాదగిరి అనే వ్యక్తితో పాటు పోలీసులు వేధించడంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్టు మధు ఓ సూసైడ్ నోట్ రాసినట్టు సమాచారం. నకిరేకల్ లోని ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఏదో బెయిల్, ఎంక్వయిరీ విషయం అని అక్కడి నుంచి పోలీసులు తీసుకొచ్చి వేధించారనే ఆరోపణలున్నాయి.
ఈ వేధింపుల కారణంగానే మధు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన మరణానికి బోడ యాదగిరి, అతని తమ్ముడు రమణ, అలాగే పోలీసులు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేవలం రజకుడనే ఉద్దేశంతో ఇలాంటి వేధింపులకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ లేఖలో మరో ఇద్దరి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు, స్థానికులు యాదగిరి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారు అక్కడికి చేరుకుని ధర్నా నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు, వివరాలు తెలియాల్సి ఉంది.






