Mohan Babu Complaint: మంచు మనోజ్‌కు కలెక్టర్‌ నోటీసులు

by srinivas |   ( Updated:2025-01-18 08:33:04.0  )
Mohan Babu Complaint: మంచు మనోజ్‌కు కలెక్టర్‌ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), మనోజ్(Manoj) ఆస్తుల పంచాయితీ కలెక్టర్(Collector) వద్దకు చేరింది. జల్లపల్లి నివాసాన్ని(Jalpally House) తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని, వెంటనే ఖాళీ చేయించాలని, సినియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కలెక్టర్‌ను మోహన్ బాబు కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మంచు మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు.

కాగా కొన్ని రోజుల క్రితం మంచు మోహన్ బాబు, మనోజ్ మధ్య ఆస్తుల వివాదం(Assests Dispute) జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. మనోజ్ జల్లపల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కలెక్టర్‌ను ఆశ్రయించారు. తన ఆస్తులను కొడుకు మనోజ్ నుంచి స్వాధీనం చేయించాలని కోరారు.

Advertisement

Next Story