- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫెర్నాండెజ్‌లో మొట్టమొదటి హాస్పిటల్ ఆధారిత ‘బేబీ స్పా’ ప్రారంభించిన కలెక్టర్ హరి చందన..
కుటుంబ-కేంద్రీకృత సంరక్షణ ఆనవాయితీకి పేరుగాంచిన ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హాస్పిటల్ సెట్టింగ్‌లో మొట్టమొదటిసారిగా ‘బేబీ స్పా’ను ప్రారంభించింది.

దిశ, జూబ్లీహిల్స్: కుటుంబ-కేంద్రీకృత సంరక్షణ ఆనవాయితీకి పేరుగాంచిన ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హాస్పిటల్ సెట్టింగ్‌లో మొట్టమొదటిసారిగా ‘బేబీ స్పా’ను ప్రారంభించింది. దీనిని ఫెర్నాండెజ్ హాస్పిటల్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 6 వారాల నుండి 9 నెలల వయస్సు గల శిశువుల కోసం రూపొందించబడిన ఈ స్పా బంజారాహిల్స్‌లోని ఫెర్నాండెజ్ స్టార్క్ హోమ్‌లో నెలకొల్పారు. ఇది ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో హైడ్రోథెరపీ, బేబీ మసాజ్, తల్లిదండ్రుల బంధం, ఇంద్రియాల ఉద్దీపనలతో శిశువుల అభివృద్ధికి తోడ్పాటునందించే ప్రశాంతమైన వేదిక. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన మాట్లాడుతూ.. “ఫెర్నాండెజ్ బేబీ స్పా అనేది వినూత్న సైన్స్ ఆవిష్కరణ అని. చాలా రోజులుగా ఆమె ప్రెగ్నెన్సీ కోసం చాలా ఆసుపత్రులను సంప్రదించిన చివరకు
నార్మల్ డెలివరీ , పాత పద్ధతిలో సంప్రదాయంగా నాచురల్ బర్త్ , బేబీ ఆరోగ్యంలో మంచి చికిత్స అందజేయడంలో ఫెర్నాండెజ్ హాస్పిటల్ చాలా ఉపయోగపడిందని తమ అనుభవాలను , తాను స్వయంగా చికిత్స తీసుకుని అందజేసి తీరును మీడియముఖంగా కలెక్టర్ హరిచందన తెలిపారు. ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, ఎమ్‌డీ డాక్టర్.ఎవిటా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ., “ఫెర్నాండెజ్ బేబీ స్పా ప్రారంభం మాకు ఒక నూతన అధ్యాయాన్ని సూచిస్తుందిఅని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రజిత , డా. సాయి కిరణ్ , డా. లత బాల సుందరం తదితరులు పాల్గొన్నారు.






