- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలపై సీఎం సీరియస్
5.5 ఎంఎం వర్షపాతానికి ఐటి కారిడార్ అతలాకుతులమైంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి గంటలు తరబడి ట్రాఫిక్ జాం నెలకుంది.

దిశ, శేరిలింగంపల్లి : 5.5 ఎంఎం వర్షపాతానికి ఐటి కారిడార్ అతలాకుతులమైంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి గంటలు తరబడి ట్రాఫిక్ జాం నెలకుంది. ట్రాఫిక్ జామ్ కష్టాలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయం లోపమే సమస్య కారణమని స్పష్టం చేయడంతో అప్రమత్తమైన అధికారులు ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాలు పరిశీలించారు. దీంతో వివిధ శాఖల అధికారులతో కూడిన సమన్వయ కమిటీ మంగళ వారం ఐటీ కారిడార్ లోని వాటర్ లాగింగ్ పాయింట్లను సందర్శించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు సుదర్శన్ రెడ్డి,రాష్ట్ర డిజిపి సివి.అనంద్,హైడ్రా కమిషనర్ రంగనాథ్,సియంసి కమిషనర్ సృజన, సైబరాబాద్ సిపి డాక్టర్ రమేష్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పలువురు ఉన్నత అధికారులతో కలిసి సందర్శించారు.ఐటి కారిడార్ పరిధిలోని రాయదుర్గం మల్కం చెరువు,మాదాపూర్ నెక్టార్ గార్డెన్,కొండాపుర్ సంతోష్ దాభా,మొండికుంట చెరువు ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్ల ను సందర్శించిన సమన్వయ కమిటీ అధికారులకు పలు సూచనలు చేశారు. వీజపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వర్షాకాలంలో రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ట్రాఫిక్ సమస్యలను తీరేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. లోటత్తు ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంజనీరింగ్ తప్పిదాలపై చర్యలేవి?
వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు అందుకు గల కారణాలు అన్వేషించడంలో విఫలమవుతున్నారు. ప్రతీ ఏటా నాలా పూడిక తొలగించేందుకు ఒక్కో సర్కిల్ కు కోటి రూపాయల పైబడి వెచ్చిస్తున్నారు.కానీ కాలువల్లో చెత్తా చెదారం పేరుకు పోయి ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువలు నిండిపోతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తున్న అధికారులు పూడిక తొలగించారో లేదో చూసే తీరిక లేదు. బిల్లులు మంజూరు చేయడంలో ఉన్న శ్రద్ధ పూడికి చేతపై లేకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో సమస్యలు ఎదురవుతున్నాయి. సమీక్షలు చేస్తున్న ఉన్నతాధికారులు పర్యవేక్షన లోపపై దృష్టి పెట్టడం లేదు. సైబరాబాద్ మునిసిపల్ అధికారులు ,పోలీసులు ,హైడ్రా సమన్వయంతో పలుమార్లు తనిఖీలు చేసిన సమస్య యధాతధంగా ఉంటుంది.గొలుసుకట్టు చెరువులకు పేరున్న శేర్లింగంపల్లి ప్రాంతంలో 90 శాతం చెరువులోకి చుక్క వర్షం నీరు చేరడం లేదు. సుందరీకరణ పేరుతో చెరువుల్లోకి నీరు చేరకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ప్రతి ఏట ముంపు సమస్య ఎదుర్కోవలసి ఉంటుంది.






