- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన.. అధికారులపై ఆగ్రహం
గత వారం రోజులుగా నగరాన్ని భారీ వర్షాలు ముంచేస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత వారం రోజులుగా నగరాన్ని భారీ వర్షాలు ముంచేస్తున్న సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కావడంతో నగరంలో కుండపోత వానలు కురిసి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా మూసీ నది, నాలాల పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకస్మికంగా పర్యటించారు. మైత్రీవనం, బల్కంపేట, అమీర్ పేట గంగూబాయి బస్తీల్లో రేవంత్ పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కాగా లోతట్టు ప్రాంతాల్లో, బస్తీల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ కు సూచించారు. బల్కంపేటలో, గంగూబాయి బస్తీలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద చర్యలు తీసుకొని, నీరు నిలిచిపోకుండా చూడాలని అన్నారు.






