టీజీటీఏ డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

by Bhoopathi Nagaiah |

ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి టీజీటీఏ నూత‌న సంవ‌త్సర డైరీ, కాలెండ‌ర్లను ఆవిష్కరించారు.

టీజీటీఏ డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) నూత‌న సంవ‌త్సర డైరీ, కాలెండ‌ర్లను సీఎం రేంత్‌రెడ్డి ఆవిష్కరించారు. గురువారం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డిని టీజీటీఏ ప్రతినిధుల బృందం క‌లిసింది. ఈ సంద‌ర్భంగా టీజీటీఏ నూత‌న సంవ‌త్సర డైరీ, కాలెండ‌ర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రాములు, మ‌హిళా అధ్యక్షురాలు ఎం.రాధ‌, ప్రధాన కార్యద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్స్ పూల్‌సింగ్‌చౌహాన్‌, సీహెచ్‌.శ్రీ‌నివాస్‌, కార్యద‌ర్శి స‌రిత‌ పాల్గొన్నారు.

Next Story