బోనాల పండగ విజయవంతం.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం

by Muthe.Rajitha |

ఆషాఢ మాస బోనాల(Bonalu) పండుగను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు.

బోనాల పండగ విజయవంతం.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆషాఢ మాస బోనాల(Bonalu) పండుగను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం హైదరాబాద్, సికంద్రాబాద్‌లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం, ఉజ్జయిని మహంకాళి, బాల్కంపేట్ ఎల్లమ్మ, భాగ్యలక్ష్మి ఆలయాలతో సహా వివిధ ఆలయాల్లో జూన్ 26 నుండి జులై 24 వరకు ఘనంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డి జులై 14న సికంద్రారాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు.

ఈ వేడుకలను సజావుగా నిర్వహించినందుకు పోలీసు, GHMC, ఎండోమెంట్, విద్యుత్, నీటి సరఫరా శాఖల అధికారులు సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. వీరి సమన్వయంతో భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా అందించబడ్డాయని అన్నారు. రేపు లాల్ దర్వాజా ఆలయంలో జరగనున్న రంగం (భవిష్యవాణి), ఘటం ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

Next Story