మూసీ ప్రక్షాళనపై దూకుడు పెంచిన రేవంత్... అధికారులకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-11 11:45:13  IST  )

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ....

మూసీ ప్రక్షాళనపై దూకుడు పెంచిన రేవంత్... అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: మూసీ ప్రక్షాళన(Mousse cleansing)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దూకుడు పెంచారు. ఈ మేరకు అధికారులతో ఈ రోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మూసీ పునరుజ్జీవనంపై చర్చించారు. ఇప్పటివరకూ పనులు ఎంతవరకూ వచ్చేయనే విషయాన్ని అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంకెంత పనులు మిగిలి ఉన్నాయనే విషయంపై ఆయన ఆరా తీశారు. అలాగే రాష్ట్రంలో జాతీయ రహదారులు, ట్రిపుల్‌పైనా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులకు పలు సూచనలు చేశారు. రిజనల్ రింగ్ రోడ్డు పూర్తి అయ్యేలోపే మూసీ ప్రక్షాళన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Next Story