- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో జనగామకు స్థానం.. సీఎం ట్వీట్ వైరల్
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో జనగామకు స్థానం.. సీఎం ట్వీట్ వైరల్
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో జనగామ జిల్లాకు స్థానం రావడంపై సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోని 50 జిల్లాలలో జనగామ జిల్లాకు స్థానం రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ “ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాలలో తెలంగాణ రాష్ట్రం నుండి జనగామ జిల్లా చోటు సంపాదించడం హర్షించదగిన విషయం. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఈ విజయం నిదర్శనం. ఈ విజయానికి కారణమైన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదర్శనీయుడు. ఆయనకు నా ప్రత్యేక అభినందనలు. మిగతా జిల్లాల కలెక్టర్లకు కూడా జనగామ సాధించిన విజయం స్ఫూర్తి కావాలని ఆశిస్తున్నాను ”అని సీఎం రేవంత్ ట్వీట్చేశారు.
Next Story






