- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhuyashki Goud : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్య సమయంలో నిరుపేద ప్రజలకు ఒక వరం లాంటిదని ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ మధుయాష్కి గౌడ్ వెల్లడించారు.

X
దిశ, ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్య సమయంలో నిరుపేద ప్రజలకు ఒక వరం లాంటిదని ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ మధుయాష్కి గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ
ప్రభుత్వం సామాన్య ప్రజలకు నాణ్యతమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తుందని వెల్లడించారు. వనస్థలిపురం డివిజన్ కు చెందిన రామ్ రెడ్డి ఇటీవల నరాల బలహీనతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడం జరిగిందని ఈ విషయాన్ని డివిజన్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తన దృష్టికి తీసుకురావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయలు రామ్ రెడ్డికి ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు.
- Tags
- Madhuyashki Goud
Next Story






