- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy : కొత్త ఫ్లైఓవర్లపై సీఎం రేవంత్ రెడ్డి నజర్

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్ల(New FlyOvers)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టి సారించారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, GHMC ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. మీరాలం చెరువు(Meeralam tank)పై బ్రిడ్జి నిర్మాణానికి 3 నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మూడు ప్రతిపాదనలు సమర్పించగా.. రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి సమాచారంతో తనని మళ్ళీ కలవాలని ఆదేశాలు జారీ చేశారు. డీపీఆర్ పూర్తయ్యాక, నెలరోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో ఆటవిడుపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణకు సంబంధించిన పనుల్లో పలు సూచనలు చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివ్రుద్ది, ఫ్లైఓవర్లు,అండర్ పాసుల నిర్మానానికి టెండర్ ప్రక్రియ, కోర్టు కేసులపై సీఎం ఆరా తీశారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివ్రుద్ది శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.