‘పేపర్ లీకేజీ పట్ల సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’

by Dishanational2 |
‘పేపర్ లీకేజీ పట్ల సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’
X

దిశ, సికింద్రాబాద్: పేపర్ లీకేజీ పట్ల సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని టీఎస్ జేఏసీ ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ముప్పై లక్షల పోస్ట్ కార్డు ఉత్తరాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఓయూ జేఏసి చైర్మన్ బట్టు శ్రీహరి మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ జరిగి ముప్పై రోజులు గడుస్తున్న కేసీఆర్ స్పందించక పోవడం సిగ్గు చేటన్నారు. విద్యార్ది, నిరుద్యోగ యువత పోస్టు కార్డుల ద్వారా పేపర్ లీకేజీ పై, వారి అభిప్రాయాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో కేటీఆర్ పాత్ర గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర సందేశం పంపినట్లు తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత రొడ్లమీదకి వచ్చి అరుస్తుంటే, కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడని మండిపడ్డారు. పేపర్ లీకేజీ చిన్న విషయం అన్నట్టు వ్యవహరిస్తూ పేపర్ లీకిజికి పక్కన పెట్టడం సరికాదన్నారు. వెంటనే బోర్డు చైర్మన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed