- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ భారత్‌కు కాబోయే PM: ఆనంద్ కుమార్ గౌడ్
by Satheesh |
వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు అన్నారు.

X
దిశ, కార్వాన్: వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్‌లోని సూరజ్ ఫంక్షన్ హాల్‌లో భారత రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ ఆనంద్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేనటువంటి వివిధ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అని నియోజకవర్గ ఇన్చార్జి ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. దేశ ప్రజలందరూ కేసీఆర్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, హోం మంత్రి మహమూద్ ఆలీతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






