Ganesh Chaturthi : మట్టి వినాయకులను పూజించాలి..

by Taduka Kalyani |   (  Updated:2025-08-26 09:23:10  IST  )

మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎల్బీనగర్ జోన్ డిసిపి సిహెచ్. ప్రవీణ్ కుమార్ అన్నారు.

Ganesh Chaturthi : మట్టి వినాయకులను పూజించాలి..
X

దిశ, చైతన్యపురి : మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎల్బీనగర్ జోన్ డిసిపి సిహెచ్. ప్రవీణ్ కుమార్ అన్నారు. వాస్విక్ ఫౌండేషన్, ఎల్బీనగర్ డివిజన్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో డివిజన్ లోని పోలీసులకు మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 436 మంది డివిజన్ లోని పోలీస్ సిబ్బందికి మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. నిమజ్జనం జరిగే వరకు పోలీసులు కష్టాలు భరిస్తూ నిరంతరం విధులలో ఉంటారని ఈ పండుగను ఉత్సాహభరితంగా చేసుకుందామని సూచించారు. ప్రతి ఒక్కరూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కృష్ణయ్య, సిఐలు వినోద్ కుమార్, సైదులు, సైదిరెడ్డి, మక్బూల్ జానీ, డిఐ నాగార్జునరెడ్డి ఎస్సైలు సిబ్బంది వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేష్ ప్రజాపతి పాల్గొన్నారు.

Next Story