తెలంగాణ భవన్ నిరసనలో తోపులాటలు..!

by Ratna Kumari |

సీతాఫలమండి భవాని నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు ఝాన్సీ తెలంగాణ భవన్‌లో జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు.

తెలంగాణ భవన్ నిరసనలో తోపులాటలు..!
X

దిశ, సీతాఫలమండి : సీతాఫలమండి భవాని నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు ఝాన్సీ తెలంగాణ భవన్‌లో జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీ సమయంలో పోలీసులు- బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాటలు చోటుచేసుకోవడంతో, ఆమె ఛాతిపై ఒత్తుకుపోయి తీవ్ర గుండె నొప్పి రావడంతో అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కొంత మేరకు మెరుగుపడింది. చికిత్స అనంతరం ఝాన్సీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీతాఫల‌మండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గరికపోగుల చంద్రశేఖర్ ఝాన్సీ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయ‌న‌ భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రవి, మహిళా నాయకురాలు సరోజతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story