- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం పై అవగాహన కల్పించాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం పై అవగాహన కల్పించాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
by Ratna Kumari |
బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, భవిష్యత్తు, విద్య ఆవశ్యకతపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

X
దిశ, రాంనగర్ : బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, భవిష్యత్తు, విద్య ఆవశ్యకతపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్ రాంనగర్ లోని శ్రీనివాస క్లాత్ స్టోర్ పక్కన గల అంగన్ వాడీ కేంద్రాన్ని కేంద్రమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్ వాడీలను అప్‌గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఆట పాటలు, విద్య, నైపుణ్యాల దిశగా వారిని మోటివేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనీ చెప్పారు. తొలి దశలో ప్రభుత్వ సొంత భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్ వాడీలను లక్ష్యంగా చేసుకుని అంగన్ వాడీ కేంద్రాల్లో టీవీలు, ఫ్యాన్ల ఏర్పాటు ఫ్లోరింగ్, కలరింగ్ పెయింటింగ్ పనులు. బుక్స్, బ్యాగ్స్, వాటర్ ఫెసిలిటీ, యూనిఫార్మ్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ భవనాల్లో ఉన్న అన్ని అంగన్ వాడీలను దశలవారీగా అప్‌గ్రేడ్ చేస్తున్నామనీ చెప్పారు.
Next Story






