- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
శ్రీచైతన్య కాలేజీ ఫుడ్ పాయిజన్ ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్
X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ అక్షర బాలికల క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఆయా ఛానళ్లు, పేపర్లలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా పరిగణించి శ్రీ చైతన్య అక్షర క్యాంపస్ హాస్టల్‌ను మూసివేయాలంటూ సంబంధిత అధికారులకు సిఫారసు చేసింది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద శ్రీ చైతన్య కాలేజీని సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేసిన 24 గంటల్లోనే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడం, కనీస సదుపాయాలు కూడా లేకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ఆ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్ పేర్కొన్నారు.
Advertisement
Next Story