చర్లపల్లి డ్రగ్స్‌ కేసు నిందితులకు రిమాండ్

by Vemula.Srinu Prasad |

చర్లపల్లి వాగ్దేవి కెమికల్స్‌ డ్రగ్ కేసులో హైదరాబాద్‌లో పట్టుబడ్డ నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు థానే కోర్టులో హాజరుపరిచారు..

చర్లపల్లి డ్రగ్స్‌ కేసు నిందితులకు రిమాండ్
X

దిశ,తెలంగాణ బ్యూరో: చర్లపల్లి వాగ్దేవి కెమికల్స్‌ డ్రగ్ కేసులో హైదరాబాద్‌లో పట్టుబడ్డ నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు థానే కోర్టులో హాజరుపరిచారు. 12 మంది నిందితులకు 15 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ థానే కోర్టు ఆదేశాలు జారి చేసింది. 12 మంది నిందితులలో వాగ్దేవి కెమికల్స్‌ యాజమాని విజయ్, మరో నిందితుడు తానాజి కూడా ఉన్నారు. వారిని క్రైమ్ బ్రాంచి కస్టడికి ఇవ్వాలని థానే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హైదరాబాద్‌లో సీజ్ చేసి తరలించిన కెమికల్స్‌ను కోర్టుకు అందజేశారు. డ్రగ్స్ తయారిలో గత పదేళ్ళుగా శ్రీనివాస్ విజయ్ ఉన్నాడని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ వెనుక ఎవరెవరూ ఉన్నారన్న కోణంలో విచారణ చెపడుతున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Next Story