ఆ ఫ్యాక్టరీలో ఒకొక్కటిగా పేలుతున్న కెమికల్ బ్యారెల్ లు

by Sridhar Babu |

పాతబస్తీ పురానాఫూల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఆ ఫ్యాక్టరీలో ఒకొక్కటిగా పేలుతున్న కెమికల్ బ్యారెల్ లు
X

దిశ, చార్మినార్ : పాతబస్తీ పురానాఫూల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కామాటి పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దాంతో కెమికల్ ఫ్యాక్టరీ లోని కెమికల్ బ్యారెల్ లు పేలుతుండడంతో అగ్ని మాపక సిబ్బందికి మంటలు ఆర్పడం కష్టతరంగా మారింది. దీంతో పక్కనే ఉన్న ఇతర కెమికల్ ఫ్యాక్టరీలకు చెందిన వారు ఎక్కడ మంటలు విస్తరిస్తాయోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. వివరాల లోకి వెళితే...పాతబస్తీ పురానా ఫూల్ శ్మశానవాటిక సమీపంలో స్వస్తిక్ కెమికల్ గోదాంలో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన సిబ్బంది బయటికి పరుగులు తీశారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కామాటిపూర పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే ఐదు ఫైర్ ఇంజన్ ల ద్వారా మంటలు ఆర్పుతున్నప్పటికీ ఆ కెమికల్ ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్ లు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు మళ్లీ చెలరేగుతున్నాయి. పక్కనే ఉన్న ఇతర కెమికల్ ఫ్యాక్టరీ లకు చెందిన వారు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును కామాటి పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story