ప్రేమ పేరుతో మోసం.. బాలుడి పై పోక్సో కేసు

by Ratna Kumari |

ప్రేమ పేరుతో మోసం చేసిన మైన‌ర్ బాలుడి పై పోక్సో కేసు న‌మోదు అయింది. ఈ ఘ‌ట‌న వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో మోసం.. బాలుడి పై పోక్సో కేసు
X

దిశ, వనస్థలిపురం : ప్రేమ పేరుతో మోసం చేసిన మైన‌ర్ బాలుడి పై పోక్సో కేసు న‌మోదు అయింది. ఈ ఘ‌ట‌న వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్ట‌ర్ ర‌విబాబు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మైన‌ర్ బాలుడు వ‌న‌స్థ‌లిపురం నివ‌సిస్తున్న బీహార్ కి చెందిన ఓ బాలిక‌ను ప్రేమ‌తో వంచించి మోసం చేసిన‌ట్టు ఫిర్యాదు అందింది. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజ‌రు ప‌రిచారు. అనంత‌రం జువైన‌ల్ హోం కి త‌ర‌లించారు. కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని సీఐ తెలిపారు.

Next Story