- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో గందరగోళం.. బీజేపీ కార్పొరేటర్లు అరెస్ట్
GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో గందరగోళం.. బీజేపీ కార్పొరేటర్లు అరెస్ట్
by Ramesh Naini |
GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో గందరగోళం నెలకొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో గందరగోళం నెలకొంది. గురువారం మీటింగ్ ప్రారంభం కావడంతోనే స్టాండింగ్ కమిటీ హాల్ ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. నగరంలో పెచ్చరిల్లుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.స్ట్రీట్ లైట్స్ పనితీరు సరిగా లేకపోవడం, చెత్త సేకరణలో GHMC విఫలమవుతున్నదంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. అన్ని డివిజన్ల నుంచి పన్నులు వసూలు చేసి, కేవలం కొన్ని డివిజన్లకే నిధుల కేటాయింపు జరుగుతుందంటూ వారు ఆరోపించారు. ధర్నా తీవ్రతరం కావడంతో కార్పొరేటర్లు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరకు నిరసన వ్యక్తం చేస్తున్న పలువురు బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.
Next Story






